దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

095. గొల్లవారము


గొల్లవారము సద్గురుని సేవకలవారము
చీకటికోనలోన చిట్టడవి మేసే పశువుల
చిత్తమందున దొడ్డికట్టి చెదరకుండా మందతోలే
॥గొల్ల॥
వరయోగ తిరుమంత్రమును వదలక సేవించేవారికి
...    ....    ....    ....    చల్లలమ్మే
॥గొల్ల॥
గోప్యమైనా తిరుమంత్రమును గొడ్డలొకటి చేతబూని
అండగోరండమైన అడవి నరకి దొడ్డి కట్టే
॥గొల్ల॥
అందమైన బిందెలోన చెదరకుండా పాలుపితికి
పొంకమైనా అడుపుమీదా పొంగకుండా పాలుకాచే
॥గొల్ల॥
శాంతమను పాలారబోసి, చతురాక్షరమున తోడూ యుంచి
ఆత్మయనియెడు భాండములోనా, అందముగా తైరుదరచే
॥గొల్ల॥
తిరుమంత్రమను కవ్వము బట్టి, ద్వైమంత్రమనే తైరుతరచి
శరణార్థియను వెన్న దీసి, చెదరకుండా ముద్దాచేసే
॥గొల్ల॥
అన్నివిధముల అమరగాచి, వన్నెమీరా నెయ్యిదీసి
వినయమైన విన్నపముతో నిష్టతో నిజగురుని చేరే
॥గొల్ల॥

హఠయోగుల గుప్తతత్త్వాలు గుర్తుకు వస్తున్నవి. వడగళ్‌ వైష్ణవము భక్తునికి అధికార అర్హతను నిర్ణయిస్తూ సాధన పట్ల కొంత గోప్యతను కోరుతుంది కాబోలు. అందుకేనేమో ఈ పాట ఇళ్ళలోనే గాని వీధిలో వినబడక పోవటము.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gollavAramu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )