దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

097. అధ్యాత్మము


వీరెవరో తాతగారు బియ్యపుమూట నెత్తిమీద ఉన్నప్పటికీ ముష్టిమానలేదు. ఏమంటారు? జోగయ్య తాతగారా? ఆ బియ్యము కొవ్వూరు సత్రానికివ్వడానికా? ధన్యుడు. దండము తాతగారూ.

ధీరుడు విశ్వామిత్రుడు తానయోధ్యకు
శ్రీరామునీ జూడవచ్చెను - అని
వారుడై సౌధము జొచ్చెను - ఎదురూ
గారాజు చని తోడి తెచ్చెను - మునికీ
చారు సింహాసనమిచ్చెను - మహూ
దారుడై పూజ యొనర్చెను - స్వామీ
మీరు వచ్చినయట్టి కారణ మది దెల్పు
డీ రాజ్యమైన మీకిచ్చెద ననె
ను రాకేందువదన వినవె యీ చరితము కుందరదనా ॥

మనసా వాచా కర్మణా మూడు యోగాలూ సాధన చేస్తున్నాడీ బడుగు బ్రాహ్మణుడు!
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - adhyAtmamu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )