దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

098. తాతతో పరిహాసకం


అదుగో తాతమీద పాడుతున్నాడు గారడీవాడు. ఆ పాగా, మీసము, ఎర్ర చొక్కా, బంగారు బిళ్ళల దండా. క్రీడాభిరామ కాలానికీ నేటికీ అదే వేషమితనికి.

తాతో పీతో ముంజికాయ మూతో
ఉల్లికోడు ఊతో తాతోయి తాత
తాతోయ్‌! మా యింటికి రారో! మాటుంది;
నూవు కూసుంటె; కురిసీల పీటుంది;
నూవు నుంచుంటె; నిమ్మ చెట్టు నీడుంది;
నూవు తొంగుంటె; పట్టి మంచం పరుపుంది;
నీ కాకలయితె; సన్నబియ్యం కూడుంది;
అందులో కొంకాయి; కూరుంది;
నువ్వు సస్తేను; వల్లకాటి దిబ్బుంది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - tAtatO parihAsakaM - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )