దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

099. తోడు లేదన్నా


పిల్లల్ని ఆకర్షించటానికి ఈ పాట. వారూ పాడతారు దీని మొదటి చరణాన్ని. రెండో పాట వినండి.

ఎగిరే జట్కాబండి। నడిచే వొంటెద్దు బండి ।
గ్రుడ్లెఱ్ఱ జేసింది । గుఱ్ఱం బండీ    ॥గ్రు॥
యీ మూడు జాతుల కలపుకోని । వూడ బొడచిన ।
రయిలు బండి । కమురు కంపు బొగ్గునీళ్ళు తోడులేదన్నా ॥
వుడికె తోటకూర । మొలచే చెంచలి కూర
గ్రుడ్లెఱ్ఱ జేసింది । గులుగు కూర     ॥గ్రు॥
యీ మూడు జాతుల కలపుకోని । వూడ బొడచిన ,
గోంగూర । కమురు కంపు రొయ్యి పీచు తోడులేదన్నా ॥
వుడికె ఉలవపప్పు । చెరిగే సెనగ పప్పు
కళ్ళెఱ్ఱ చేసింది । కందిపప్పు        ॥క॥
యీ మూడు జాతుల కలపుకోని । వూడ బొడచిన ,
పెసర పప్పు । కమురు కంపు । నేతి బొట్టు తోడులేదన్నా ॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - tODu lEdannA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )