దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

100. రాజ నిమ్మపండు


ఇంకా మచ్చు పాటలే పాడుతున్నాడు. అసలు పాట 'రాజ నిమ్మ పండు'. డోలక్‌ వాయించేవాడు చిరుకట్టెతో తాళము నిలుపుతూ వాయిస్తాడు. అదుగో అదే -

పల్లవి:- రాజన్న రాజో! నా రాజ నిమ్మలపండో!
ఓడెల్తుందో డెల్తుంది । నా రాచ ముద్దుల బావ ।
అ। ప।:- రాజ, నా రాజ, నా రాజ నిమ్మలపండ;
నా అప్పరావు కొండ; నాలేత మామిడి మొగ్గ;
నా అప్పుడు గాచిన నెయ్యి ।
నానేతిలో ఉడికిన బూరికన్న। నేరుపైన రాజా!
ఓడెల్తుందో డెల్తుంది; నారాజ దేశమెల్లి పోతున్నావా
॥రా॥
1 చ:- వెళ్ళేవాడ వెళతావు! ఎన్నాళ్ళకు వస్తావో?
ఇంటి వెనుకల, ఆకుమడి దున్నెల్లు రాజా!
వచ్చిందాక; చూచుకుంటాను
॥రా॥
2 చ:- వెళ్ళేవాడ వెళతావు! ఎన్నాళ్ళకు వస్తావో?
ఎడమకాలి మడమతోటి; తన్నెల్లు రాజా!
వచ్చినదాక; చెప్పుకుంటాను
॥రా॥
3 చ:- వెళ్ళేవాడ వెళతావు! రంగంలో దిగుతావు;
ఒకటో నెంబరు గళ్ళీ; చల; రెండో నెంబరు గళ్ళీ;
చల; మూడో నెంబరు గళ్ళీ; కెళితే మళ్ళిరావు రాజో
॥రా॥
4 చ:- దేశము బాగుందా? ఊరైన బాగుందా?
అనుచు, అడిగి పిలిపించి। ఆదరణ చేయించి;
ఉడుకు నీళ్ళు త్రాగబెట్టి। వేపరొట్టె చేతికిచ్చి!
అంతమంది తొలగి । అట్టే పోవు రాజో
॥రా॥

ఇది వాస్తవానికి ఓడ పాట. నమ్మించిన ప్రియుడు రంగం పోతూన్నప్పుడు పాటకపు ప్రియురాలి గుండె పాడుకొను పాట ఇది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - rAja nimmapaMDu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )