దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

102. పాండవులు పాండవులు తుమ్మెదా


ఇది సంక్రాంతి పండుగ దినములలో వరివెన్నులు చేర్చికట్టి పళ్ళెములలో పెట్టి పసుపు కుంకుమ అలంకరణము చేసి, మాలెతలు ఇంటింటికీ తిరుగుతూ పాడు పాట.

పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులె తుమ్మెదా
ఓయి భామల్లాల తుమ్మెదా, భామల్లాల తుమ్మెదా,
పండిన వరిచేలు తుమ్మెదా, పాయల్లు తొక్కింది తుమ్మెదా
పట్టండి నందిని తుమ్మెదా, గాణుకందాని తుమ్మెదా
యీనిన వరిచేలు తుమ్మెదా, తమ్మిరాయీదు వెడజిమ్మింది తుమ్మెదా
పోగ తోటలన్నీ తుమ్మెదా, పొడిపొడిగ తొక్కింది తుమ్మెదా
చెరుకు తోటలన్నీ తుమ్మెదా, చెడ తొక్కి వేసింది తుమ్మెదా
యెక్కడెక్కడ వెదకినా తుమ్మెదా, యేడాది నంది తుమ్మెదా
కాపారిచేలో తుమ్మెదా, కట్టి పెడతారు తుమ్మెదా
మాలవారి చేలోకి తుమ్మెదా, వెళ్ళునందన్న తుమ్మెదా
మాలవారు మంచివారు తుమ్మెదా, నిన్ను గొలుతూరూ తుమ్మెదా

తుమ్మెదా అన్న పాదాంత పదములతో అంతమయ్యే పాటలు శైవ సిద్ధాంత సంబంధులే ఐనప్పటికిన్నీ, తరవాత ఇతర వస్తువును కూడా ఆకళించుకున్నవి.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pAMDavulu pAMDavulu tummedA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )