దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

104. నాగుల చవితి


ఆంధ్రులకును నాగులకును విడిపోని చెలిమి. అమరావతి శిల్పములలో నాగముల వంటి తలపాగలు విరివిగా కనపడును. మధ్య భారతపు బార్హతు శిల్పాలలో కూడా తలపాగలు కనపడును. అయితే ఆ తరువాతి సాంచీ, అమరావతీ, నాగార్జున కొండ చిత్రములలో విరివిగా కనపడుటను బట్టి తలపాగా తెలుగువారి అభిమానపు టలంకరణ మనవచ్చునేమో!

ఈ పాటలు పాములకు సంబంధించినవి. క్రూరప్రాణి అయిన పామును కూడా ఆప్తులలో చేర్చుకొని పాటలు పాడటము వినోదకరమైన వింత.

ఇది జోలపాటలలోనిది.

నాగస్వరం, పాడితే । నాగులకు నిద్ర
పుట్టలోనుంటేను । భూములకు నిద్ర
అమావాస, పున్నాల । మసగలే నుద్ద
పాటి మీదా కొస్తే । కక్ష కట్టేను
బూకరించుచు । పడగ బుస్స కొట్టేను
గుడిలో నాగులు । కొల్చిన దేవుడు
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nAgula chaviti - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )