దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

105. నాగుమయ్య ఉనికి


ఈ పాటలో పాముల ఉనికి చెప్పబడింది.

పిల్లలందరు గూడి పుల్లలేరబోతె
పుల్లల్లొ వుండేటి ఓ పుల్ల నాగ ॥

ఇల్లలికి ముగ్గెట్టి మల్లెలు విరజల్లి
మల్లెల్లొ వుండేటి ఓ మల్లి నాగ ॥

గొల్లభామలు కూడి చల్లల్లు చెయ్యంగ
చల్లకుండ కింద చల్లనాగయ్య ॥

ఇవతల ఇది కొండ అవతల అది కొండ
నట్టనడుమన కొండ నల్ల తాచయ్య ॥

అనుభవానికి చక్కని వర్ణన. ఈ పాటలలో ఈ గుణము సర్వత్రా కనపడుతుంది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nAgumayya uniki - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )