దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

115. జాలుమాలి


జాలుమాలి జాలుమాలీ
జాలిరవో బేడిజిల్లా
కాకినాడ రేవులోను జాలుమాలి
జోడుకొయ్యెల వోడవచ్చె జాలుమాలి
వోడమీద సిన్నవోడ జాలుమాలి
యేళ్ళనిండ వుంగరాలు జాలుమాలి
వుంగరాల సెయ్యిసూచి జాలుమాలి
వుండదేర ముండ మనసు జాలుమాలి

ఈ పాటలో 'జాలుమాలి' అన్న పదమును కళాసీలందరూ చేరి పలుకుతారు. మాటలు పదము చెప్పేవాడు చెప్పుతుంటాడు. ఈ పాటలో కథ అల్లిక కనబడుతున్నది. పడవను విడిచి పాట ఓడను పట్టినది. ఓడలో ప్రయాణీకులు పెక్కురు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - jAlumAli - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )