దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

131. పెరుమాళ్ళ చిన్నా


ఈ పాటలోని నాయిక ప్రౌఢ. అన్ని ఉపాయములూ ఆమెగారే చెపుతున్నది. ఏ అపాయము వచ్చినను పైయెత్తు ఆమె ఊహలో ఉండనే ఉన్నది. ఏరువస్తే ఈదిపోదామనే చెలిమికత్తె ఈమె.

ఈ పాటలోని చరణములు మాత్రమే సత్యములు, వాటి వరుస, సంఖ్య కాకపోవచ్చును.

కొత్తకుండ నీరుతీపి, కోరిన మగవాడు తీపి
వాడినా చెఱకెంత తీపబ్బీ పెరుమాళ్ళ చిన్నా
                పదరా బందారు పోదాము
నీకు నీవారులేరు, నాకు నావారు లేరు
ఏటి యొడ్డున్న యిల్లు కట్టబ్బీ, పెరుమాళ్ళ చిన్నా
ఏరువస్తే కూడ బోదాము
చెంపనా సంపంగినూనె, అంచునా చెంగల్వ మొగ్గ
ఏటి వడ్డున యిల్లు కడదాము
బావిలోపల బల్లి పలికె బన్నసరమూ కొలుకులూడె
బిళ్ళలా మొలత్రాడు తెగెనబ్బీ, పెరుమాళ్ళ చిన్నా
ఏరువస్తే ఈది పోదాము
ఆకసాన ఆకుతోట యంత్రమధ్యన పూల తోట
పూలతోటలో బండ్లబాటమ్మీ, పెరుమాళ్ళ చిన్నా
బండ్లబాటలో మంచి మాటమ్మి॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - perumALLa chinnA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )