దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

141. గైరమ్మ


వీడెవరో మరియొక ఆకు జాస్తిగా చదివినవాడు. నక్కజిత్తులు చేస్తున్నాడు. వెర్రికాకి వీని వలలో పడేనా?

గైరమ్మోల్‌! గైరమ్మా!
నిన్నే తల్లి గన్నదే । గైరమ్మా!    ॥గై॥
నీ ముక్కెంత చక్కనే । గైరమ్మా!
నీ ముక్కులో నత్తెంత అందమే। గైరమ్మా!    ॥గై॥
నీ నడుమెంత చక్కనే । గైరమ్మా!
నీ నడుము వడ్డాణమెంత అందమే । గైరమ్మా!    ॥గై॥
నీ కాలెంత చక్కనే । గైరమ్మా!
నీ కాలి అందెలెంత అందమే। గైరమ్మా!    ॥గై॥
నీ వొల్లెంత చక్కెనే । గైరమ్మా!
నీ వెల్లమీది నగలెంత అందమే । గైరమ్మా!    ॥గై॥
నీ కళ్ళెంత చక్కనే । గైరమ్మా!
నీ కళ్ళకాటుకెంత అందమే । గైరమ్మా!    ॥గై॥

పొగడ్తలు గైరమ్మ కోసమా, నత్తు వడ్డాణాము, అందెలూ నగలూ కోసమా? తెలుసుకోగల అవకాశము మనకు లేదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gairamma - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )