దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

143. చిన్నవాడు - చిన్నది


వీరిద్దరూ అనుకూలురు. ఆ ఉత్సాహము బాగుగా తెలుస్తుంది చూడండి.

1
చక్కని గుంటా । రాయె నా యెంటా
సరస కూచుంటా । పెళ్ళి చేసుకుంటా
గుఱ్ఱాన్నెక్కిస్తా । కూడా నేనొస్తా
సఱ్ఱూన వూరంత । సైదిరిగి వత్తాము    ॥చ॥

2
నే కులాస గుంటా । నిన్నంటా
నిన్నే పెళ్ళాడతా । నంటా
నాకు నీకు జోడంటా
నాకేమి పెట్టకు । తంటా    ॥చ॥

3
చేపల బుట్ట । చంకనెట్టి
సందెడు పూసలు । మెళ్ళో బెట్టి
కోపుగ కాట్రేడు । చీరను గట్టి
గోటేసిన రవిక । తొడిగబెట్టి    ॥చ॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - chinnavADu - chinnadi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )