దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

146. గంగి


గంగీకి నాపైన మనసొప్పకుంటేను
నడబావిలో పడి - చస్తానని చెప్పు గంగితో
        మాపు - వస్తాననీ చెప్పు గంగితో ॥
                
చెవులాకు కమ్మాలు, కాళ్ళాకి అందేలు
తెస్తానని చెప్పు గంగితో
        మాపు - వస్తాననీ చెప్పు గంగితో ॥

బాణాల చీరాను, బొమ్మంచు రవికాను
తెస్తానని చెప్పు గంగితో
        మాపు - వస్తాననీ చెప్పు గంగితో ॥

అన్నీ ఆ తుంటరి మాటలే. ఆ గంగి వీనికి లొంగునా?
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gaMgi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )