దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

147. యెరికిలీ


ఈమె జారిణి. తన అన్వేషణమునూ, రంకువాండ్ర నీతినీ కూడా చక్కగా ఉపన్యసిస్తున్నది. తార చెల్లెలు. వాడు మాత్రము 'యెరికిలి'.

గాజులుండే చేతిలోన గందవొడి పూత పూసి
వీధి వీధులు పలవరించురా - ఓ యెరికిలీ
వీధి వీధులు పలవరించురా
బావిలో బచ్చల్లి కూర చేనిలో చెంచల్లి కూర
చెంపకూ సంపెంగ నూనెరా - ఓ యెరికిలీ
చెంపకూ సంపెంగ నూనెరా
నూగు నూగు మీసమోడ, నూగుచెట్ల కావిలోడ
పరగచేని బాట తెలుపుమురా - ఓయెరికిలీ
పరగచేని బాట తెలుపుమురా
కూడు పెడతా తినిపోరా, కూడా వస్తా తోడుకపోరా
ముళ్ళు లేని మొల్ల కిందికీ - ఓ యెరికిలీ
ముద్దులాడి మళ్ళీ పంపురా
ఈతమానూ యిల్లు కాదూ, తాటిమానూ తావు కాదూ
తగరం బంగారు కాదురా, ఓ యెరికిలీ
తగులుకున్న మొగుడు కాదురా
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - yerikilI - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )