దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

150. రాజడిగితేమందును?


ఈ పాట కాలు జారిన చిన్నదానికినీ ఆమెను తప్పుదారి త్రొక్కించిన చిన్నవానికినీ జరుగు సంభాషణను వినిపించుచున్నది. వీడు గడేకారి. ఆమెకు ఉపాయములూ, సాకులూ చెప్పి పెట్టుచున్నాడు.

కాలి మట్టెలు పోయెను । చినవాడ! రాజడిగితేమందును?
మన గడప పెద్దదనవే । చినదాన! గడప తగిలి పోయెననవే.
చేతి గాజులు పోయెను। చినవాడ! రాజడిగితేమందును?
శెనగపువు రోకలనవె! చినదాన! చెయిజారి పోయెననవే।
వళ్లెల్ల రక్కులారె । చినవాడ! రాజడిగితేమందును?
మన యిల్లు చీకటిల్లు । చినదాన! మన పిల్లి రక్కులనవే।
నొష్ఠ కుంకుమ (బొట్టులు) పోయెను । చినవాడ! రాజడిగితేమందును?
చిరు చెమటలెక్కెననుమా । చినదాన! చెమటనూ కరిగెననుమా ।

ఈమె తలుపు దగ్గర పాట నొక్కదాని నైననూ విన్నట్లు లేదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - rAjaDigitEmaMdunu? - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )