దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

159. కన్నెగోర - చిన్నచిల్క


సంఘములోనుంచి దాటిపోయి ఏతోటలోనో కొమ్మల మీద ఊగుతూ పాడుకుంటున్నారు ప్రేయసీ ప్రియులు.

మొవ్వాకు చీరపెడతా। మొగలిరేకులుపెడతా;
నన్నూ పెళ్లాడ్తావా? కన్నెగోరా?
॥మొ॥
ముద్దూటుంగరముబెట్టి । ముత్యాలపేరుగట్టి
నిన్నే పెళ్లాడతాను । చిన్నచిల్కా!
॥ము॥
ఉల్లీ పిల్లేళ్లుచేస్తా! మొల్లాతలంబ్రాలుపోస్తా
నన్నూ పెళ్లాడతావ । కన్నెగోరా!
॥ఉ॥
పసుపూ పాదాలు కడిగి । పచ్చాటంగీ తొడిగి
నిన్నేపెళ్లాడతాను । చిన్నచిల్కా
॥ప॥
గచ్చాగజ్జియలుపెడతా । పచ్చాకుతాళిగడతా।
నన్నూ పెళ్లాడతావా? కన్నెగోరా
॥గ॥
మణుల దీపాలు తెచ్చి । మంగళహారతులిచ్చి,
నిన్నే పెళ్లాడతాను । చిన్ని చిల్కా
॥మ॥

గోరువంక అనగా ఆడుచిలుక అన్న అర్థము చేసినాడు ప్రాకృత రచయిత.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kannegOra - chinnachilka - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )