దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

160. నేచిన్నదాన్నిరా


ఇది యెవరో చిన్నతనము వదలకుండనే తొందరపడినది. చేయికాలిన పిదప ఆకులు పట్టుకొను చున్నది.

వడ్లతట్టెత్తుకోని - వలసలకునేబోతె
వలసలోనాకొప్పు - గొలుసూడెరాజా
    బాలరో నే చిన్నదాన్నిరా!
    చెలియరో నే చిన్నదాన్నిరా!

ఈదులకుంటాకు - నీళ్లకునేబోతె
ఈతముల్లూ తగిలి - ఈడేరెరాజా
    బాలరో నే చిన్నదాన్నిరా!
    చెలియరో నే చిన్నదాన్నిరా!

కడియాల కుంటాకు - నీల్లకునేబోతె
కవిలిముల్లూతగిలి - కడుపాయెరాజా
    బాలరో నే చిన్నదాన్నిరా!
    చెలియరో నే చిన్నదాన్నిరా!

తుమ్మాలకుంటాకు - నీళ్లకు నేబోతె
తుమ్మముల్లూ తగిలి - తిమ్మణ్ణి నేగంటి
    బాలరో నే చిన్నదాన్నిరా!
    చెలియరో నే చిన్నదాన్నిరా!

అల్లో నేరేడుపండు - అరచేతులుండంగ
పసిపింద కొరికినా - ఫలమేమి రాజా
        బాలరో నే చిన్నదాన్నిరా
        చెలియరో నే చిన్నదాన్నిరా

తుమ్మెదలు చెలరేగి - దూలాలు తొలవంగ
మొగసాలికేమన్న - మోసమా రాజా
        బాలరో నే చిన్నదాన్నిరా
        చెలియరో నే చిన్నదాన్నిరా
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nEchinnadAnnirA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )