దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

164. ప్రత్తి చేను


సూరేపల్లి ముద్దులబావను చూచేదెన్నటికో
ఊరి ముందటి పత్తిచేను వేసేదెన్నటికో
అది పూసేదెన్నటికో మరి
కాసేదెన్నటికో

మొదట ముద్దులబావను ఈ ముగ్ధ ఊరి ముందటి ప్రత్తిచేనిలో కలసినది, మరల గలియుటకు ఆ పరిస్థితులే రావలెనని ఎదురుచూచుచున్న ఈ వెఱ్ఱి "పండి తెల్లబాఱు వరి తోటలను జూచి" మొగము వంచి యేడ్చు మహిందుని ముగ్ధకు చెల్లెలు కావలయును. మొదట పాదము తీసివేస్తే శాలివాహన సప్తశతి లోనికి ఈ పాట సులువుగ ప్రవేశించ గలదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pratti chEnu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )