దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

165. రెడ్డోళ్ళ జీతగాడా


రెడ్డోళ్ళ జీతగాడా మేటైన మొనగాడా
అబలగు బలతలుపు ఐదంకణాల యిల్లు
ఆ యిల్లు తిరిగిరారా నను ముద్దులాడి పోరా॥
నడివీధి లోన యిల్లు బాజారు లోన బావి
ఆ బావికాడ రారా నా బానలందుకోరా॥
సందులోన గుడి నడివీధిలోన సరస
నాగోటిమీద తేరు ఆ తేరు తిరిగిరారా
నా తేటలందుకోరా॥
నువు సుట్టము రీతిరారా నువు సుట్టకాలు తేరా
నను చూచియైన పోరా॥
నా అబలగు బలతలుపు ఐదంకణాల మిద్దె
ఆ మిద్దె తిరిగిరారా నను ముద్దులాడి పోరా॥
జిల్లేడమ్మ జిట్ట నా మనోరాజ మొగ్గ
నా మల్లెపూల జెండా నా ముంత మామిడి పండా
నా యింపు మీద సొంపు నా సొంపు మీద యింపు॥
నువు వస్తానంటె చాలు నా మగనికంటె మేలు
నిన్నెట్లు మరచిపోదు
ఇట్లవాని పొందు నేనెట్లు మరచియుందు॥
నీ చేతిలోన ఉంగ్రం నా చేతికీయరాదా
నా వేలికి పెట్టుకోనా పదిమందిలోకి పోనా
నీకు పేరు తేనా
చక్కాని నీటుకాడా చక్కాని బొమ్మరారా
నీ చేతిలోని అబయా నా చేతికిచ్చి పోరా
రెడ్డోళ్ళ జీతగాడా మేటైన మొనగాడా

వాడు రెడ్డోళ్ళ జీతగాడు. సరకారు సంబళమందుకొని 'దుప్పాటి చెరగు నందూన దూవాండ్లై'నా తెచ్చి ఇవ్వడా అని పిల్ల ఆశ.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - reDDOLLa jItagADA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )