దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

166. బంగారు సామి


అద్దాల మహలులోని
    ఓరబ్బా, బంగారిసామీ!
ఇట్ల రానిపోని మాటలకి
వాదాడబోకురో!
    రబ్బే! బంగరిసామీ!
ఊటికాయల కాలమొచ్చెనురో॥
    రబ్బే! బంగరిసామీ!
ఉబ్బింది - దాని మొగము
వుబ్బితే వుబ్బింది గాని
సబ్బు యేసి రుద్దరో!
    రబ్బే! బంగరిసామీ!
కలే కాయల కాలమొచ్చె
కఱ్ఱె పిల్లకి ప్రాయమొచ్చె
సుట్ట గాల్పుకున్నట్టు దాని
సుట్టింటి కెడతావు; దాని
సుట్టూర దిరుగుతవో!
    రబ్బే! బంగరిసామీ॥
ఎగవసేలో గెడ్డి గోసి
దిగవ సేలో మోపు గట్టి
ఇట మోపెత్తి పొమ్మంటే
కొంగు లాగి పోతివేమిరో॥
    రబ్బే! బంగరిసామీ!
గూడలేసే గుంటకాడ
కబిల్దోలె బాయికాడ -
ఇట్ట వజ్జరాల వాన గురిసె
విడవరింక కబిలెవో రబ్బే!
    రాజా! నా బంగరిసామీ॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - baMgAru sAmi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )