దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

169. కొయ్యోడు పాట


పల్లవి:అయ్యో: కొయ్యోడ!
అ. ప.:ఓరింట్లో తిండికి, లేకపోయింది
బైట బడాయి కొట్టకురో రయ్యో కొయ్యోడ ॥ అ॥
1 చ:కొయ్యడ కొయ్యడ, బండంటారు
వానికి బండికి । బస్తలు లేవంట
వాడి కొడుకే । మట్టిబెట్టంట
వాడి పెళ్ళం । సూరకత్తంట
ఆ గుంటకు నీకు । తగునంట్రో ॥ అ॥
2 చ:కలిగిన కంట్లో । కాటుక బెడితే
నాకన్ను మెరమెర । లాడెరో రయ్యో కొయ్యోడ
దాని మరిగిన మొగుడు । పొరుగున నుంటె
మనసు మెరమెర । లాడేరోరయ్యో కొయ్యోడ ॥
3 చ:అందము సందము । లేని మొగుండు
వాడు సందెడుంటే । ఎందుకో రయ్యో కొయ్యోడ
ఎదిగిన పిల్లను । యింట్లో బెట్టి
బైట మంచం । యెయ్యకురో రయ్యో కొయ్యోడ ॥
4 చ:చిట్టెమ్మ వచ్చిన । ముహూర్తము నుండి
దొడ్డెడు గేదలు । చచ్చెనురో ॥ ర॥
దొడ్డెడు గేదలు । చస్తే; చచ్చెనూ

ఇది కూడ వెలిచవి మరిగిన వెలది తలపులనే తెచ్చి చూపించు పాట. ప్రాకృతుల జావళీయా అనిపించుచున్నది. 'పోలీసు వెంకటస్వామి' అనే బూతులబుంగ ఒకపాట ఉన్నది. ఈ కోవలో పెక్కులు పాటలున్నవన్నమాట.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - koyyODu pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )