దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

172. మొక్కులు


మొక్కిన మొక్కులు సల్లగుండీ
మొగుడి కళ్ళుపోతే - నా
మొగుడి కళ్ళుపోతే
కట్టమీది ఆ అంకాళ్ళమ్మకు
పెట్టకోళ్ళనిస్తూ
దండుకుపోయిన యిద్దరు మరుదులు
గుండ్లు తగిలి సస్తే - పెద్ద
గుండ్లు తగిలి సస్తే
సాతులూరి యా పోతురాజుకు
మేకపోతునిస్తు
సంకన వున్నా చంటిబిడ్డకు
సన్ని గొట్టిపోతే - మాయ
సన్ని గొట్టి పోతే
సత్తెనపిల్లీ గోపాలుడికీ
నిత్తె పూజసేతు॥

దీనికి వ్యాఖ్యానము దండుగ. ఉపపతికి సొమ్ము చాలదు. ఉనికి అత్తింటనే సౌఖ్యము, అనుకూల్యత కొఱకు మాత్రమే మొక్కుకుంటున్నది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - mokkulu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )