దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

175. పడవపాట


ఇది తనకంటె పిన్నవానితో సరసములు మరిగినది. చనువెక్కువౌట తిట్లు ప్రారంభించినది.

రావూ నే రమ్మంటే । పోవూ నే పొమ్మంటే
    రవ్వా చేసెదవేమిరా । నీవెంతో
    రాలూగాయై పోతివిరా॥
మల్లెపందిరికాడ మంచమేసి పరుపేసి
    తెల్లాదుప్పటి పరచినా - దానిపై
    మల్లేమొగ్గలు చల్లినా॥
పూలాచీరా గట్టి పూసల రైకా తొడిగి
    నీలాల కొప్పు పెట్టినా - దానిపై
    పూలా దండలె చుట్టినా॥
నోట తాంబూలమూసి కాటికా కన్నీరు గార
    మాటమాని నేనుండినా - దానిపై
    తోటికోడల్‌ దొమ్ములాడినా॥
పుట్టింటికి పోదమాని పట్టూ పట్టి నేనిండా
    పట్టిడీ తాపి పారేసినా - దానిపై
    పట్టు పట్టి విదిలించినా॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - paDavapATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )