దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

176. రానుపోర


రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ
నన్ను నీవెరుగవా

1
కన్ను గిరతలలోనె కనుగొన్నావా
రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ

2
తొమ్మిది చేరలా తూగుటుయ్యాలలో
ఏజోలి లేకున్న నా జోలి నీకేల
రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ

3
నిండు పున్నమనాడు పండు వెన్నెలలోన
పరుపున్న తొట్టెలో పండినిండున్నాను
రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ

ఇది కృష్ణుని మీద పాట. చరణములు చాలా ఉన్నట్టు కనబడుతున్నది. హాస్యపు పాటలు అన్న చిల్లరపుస్తకములో ముక్తికాంతయే ఈ మాటలంటున్నట్టుగా ఉన్నది. శృంగారములో ప్రేమ ముదిరితే భక్తి అయిపోవటము వింత ఏమిటి?
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - rAnupOra - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )