దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

177. కూనలమ్మ పదాలు


కూనలమ్మ పాట ఒకటే నీతికి సంబంధించిన పాట. కూనలమ్మ పార్వతీదేవి కూతుళ్లు, కామేశ్వరీదేవికి తోబుట్టువులూ అయిన అక్కలకు కాపగు పోతురాజునకు భార్య. కూనలమ్మ సంకీర్తనములు, కూనలమ్మ చీర, కూనలమ్మకు వేట, కావ్యాలలోనున్నూ పాటలలోనున్నూ వినబడుతునే ఉంటవి. ఈ 'పదము' తక్కిన పదకావ్యముల వలె జంపె వరుసలో నడుస్తున్నది. చరణములన్నీ దొరికిన బాగుండియుండును.

అన్నమిచ్చిన వాని । నాలినిచ్చిన వాని
నపహసించుట, హాని । ఓ కూనలమ్మా!
ఆడి తప్పినవాని । నాలినేలని వాని
నాదరించుట హాని । ఓ కూనలమ్మా!
భీష్ముఁడనుభవ శాలి । భీముఁడే బలశాలి
కర్ణుఁడే గుణశాలి । ఓ కూనలమ్మా!
దుర్యోధనుఁడు భోగి । ధర్మరాజొక జోగి
అర్జునుండే యోగి । ఓ కూనలమ్మా!
కవితారసపు జల్లు । ఖడ్గాల గలగల్లు
కరణాలకే చెల్లు । ఓ కూనలమ్మా!
కాపువాఁడే రెడ్డి । గరికపోచే గడ్డి
కానకుంటే గ్రుడ్డి । ఓ కూనలమ్మా!
మగని మాటకు, మాటి । కెదురు బల్కెడి బోటి
మృత్యుదేవత సాటి । ఓ కూనలమ్మా!
జపతపంబుల కన్న । చదువుసాముల కన్న
ఉపకారమే మిన్న । ఓ కూనలమ్మా!
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kUnalamma padAlu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )