దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
('గొబ్బి' పదాలకు చాలా వయసు వుంది - అన్నమయ్యగారి "కొలని దోసరికి గొబ్బిళ్ళో-" గమనార్హం - అలాటి కోలాటం పాట - ఈ గొబ్బి)

006. గొబ్బిళ్ళు

గొబ్బీయళ్ళో గొబ్బీ గొబ్బున
చెలియాలందరు గొబ్బీ పాటలు పాడరే ...

సర్వమునకు సృష్టికర్త
సర్వేశ్వరుడొక డున్నాడే ...
సర్వేశ్వరుని ఘనత నాకూ
చక్కగ వినిపింపరే ...
నల్లగ నుండునా లేక
తెల్లగ నుండునా ...
ఎట్టి గుణము కలవాడూ
ఎవరికి మంచి వాడే ...
దుష్టతనము మనలో వుంటే
చేరి బుద్ధులు చెప్పునే ...
గొబ్బీయళ్ళో గొబ్బీ గొబ్బున
చెలియాలందరు గొబ్బీ పాటలు పాడరే ...
AndhraBharati AMdhra bhArati - gobbiLLu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )