దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(కృష్ణలీలలు - చూడాలి - అంతే! గోపికలు అందరూ కలిసి - యశోదమ్మను చేరి మీ గోపాలుడు యిలా చేశాడు, అలా చేశాడంటూ పితూరీల జమా ఖర్చులు చెబుతున్నారు.)

011. కృష్ణునిమీద పాట

ఊరుకొనుడీ
ఉవిదలారా.
ఊరువాడా
వచ్చినారాలే.
ఊరుకొనుడీ
ఉవిదలారా.
నన్ను విడచీ
చను డిటునటు.
ఎన్నడూ పొరు
గిండ్ల పోడూ.
కనులు తెరువా
యీ చిన్ని
కృష్ణునీ రవ్వ
చేసెదరూ ... ఊ...
అన్యాయా మెరుగ
బంతులారా.
ఆడుకొనునూ
తనకుతానై.
అసలు మంచీ
వాడితడూ.
అట్టి పనులూ
శాయడమ్మ.
అడుగో జగన్నాథదాసు
అతడు వీడు
వాడెపుడూ వీని
అతివలారా
సుతుని గుణము
అతని అడిగి
తెలుసుకొనరే ... ఊ ...
AndhraBharati AMdhra bhArati - kR^iShNunimiida paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )