దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(శివమహిమలకు నిదర్శనం)

013. విభూతిపండు

వేసుకొన్నా చంద్రాహారము
వేసుకొమ్మని తానిచ్చేనమ్మా
వేసి తెల్లవారి చూడబోతే
కాశిలో రుద్రాక్షలాయెనటమ్మా ...
రాతిరొచ్చిన సాంబశివునీ
నమ్మరాదే అవునే ఓయమ్మా ...

పూసుకొన్నా పునుగు జవ్వాజి
పూసుకొమ్మని తావచ్చేనమ్మా ...
పూసి తెల్లవారి చూడబోతే
కాశిలో విభూతి పండాయనటమ్మా ...
రాతిరొచ్చిన సాంబశివుడూ
ఎంతకయినా మాయలవాడూ ...
AndhraBharati AMdhra bhArati - vibhuutipaMDu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )