దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(సువ్విపాటలు - రోకలి బరువును మరిపించేవి)

015. సువ్వి పాట

సువ్వి కస్తూరి రంగ
సువ్వి కావేటి రంగ
సువ్వి రామాభి రామ
        సువ్వీ లాలీ
ఆ సువ్వి - ఆ సువ్వి ...

తుమ్మకర్రరోలు దోసి
తూముదొడ్లు వాయవేసి
దంచుదామా బియ్యం
        దంచుదామా
ఆ సువ్వి - ఆ సువ్వి ...

ఒక్కవేలు చుక్క బొట్టు
అందరికీ చాలదమ్మ
దంచుదామా బియ్యం
        చెలియ లందరు
ఆ సువ్వి - ఆ సువ్వి ...

ఒకరి ఒకరి కొప్పులోన
గుప్పెడేసి మల్లెమొగ్గలు
మగువ కాంత కొప్పులోన
        మల్లె జాజులు
ఆ సువ్వి - ఆ సువ్వి ...
AndhraBharati AMdhra bhArati - suvvi paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )