దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(అలక - అంటే అలగడంలాంటిది! పెళ్ళిళ్ళలో అల్లుడుగారి అలకపాన్పు సంగతి పాత విషయమే కదూ? పోతే ససంసారంలో అడుగడుగునా ఈ అలకల అలుగులు నిత్యకృత్యాలే కదా - అలాటిదే ఈ అలకపాట)

017. అలక పాట

పూరింటిలోపలను
చాపొకటి పరచుకొని
స్వామివచ్చిన వేళచూసి
తాను అలిగుండె.

చిలుకకూ పలుకులూ
చెప్పేది నెరజాణ
తలుపులూ మూసుకు
సవరించిన కారణమేమో
తెలుపుము ...

నీ చేతి సురటీలు
నాచేతికిచ్చినా
సరగునా కోపమూ
చల్లన చేసెద
సరసిజాక్షి
సరగున యియ్యవే ...

దండమే ఓ భామ
కన్నెత్తిచూడవే
కల్కిరో నేరస్తుడనే
కవాటమ్ములు మూయకే ...

కొత్తా పెళ్ళీకొడకా
కొడుకుని ఎత్తవోయి
కోరిక తీర్చిపోదామని
కోరీ వస్తినే ...
AndhraBharati AMdhra bhArati - alaka paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )