దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(హాస్యపూరితమైన అప్పగింత పాట)

023. అప్పగింత

అత్తమామలుగాని
ఆడబిడ్డలుగాని
లేరమ్మ నీదెంత
పున్నెమో గాని
మగడు ఒక్కడుగాన
మనసుకెక్కిన యట్లు
మర్థించి నీ వశము
చేసుకోవమ్మ
నీమాట వినుపించు
ఆ నిముషమందునా
గజగజ వణుకునట్లు
గడిగీసి చూపు
ఇరుగు పొరుగమ్మలు
ఏమైన అంటే
హడలిపోకను నీవు
హడలు కొట్టమ్మ
పతికోప పడినపుడు
పడియుండ బోక
అంతకు పదిరెట్లు
అతని మర్దించు
భర్తను వంచుకోగల
భార్య గౌరవమెన్న
రారాజునకు నైన
రమణిరో లేదు.
AndhraBharati AMdhra bhArati - appagiMta - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )