దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పూర్వకాలపు పెళ్ళిళ్ళు - చూస్తూంటే - ఎంత సరదా - ఎంత హుషారు - మరెంత హడావిడి - మగ పెళ్ళివారి బడాయిలు - పసందైన కోలాహలం - తలుపు దగ్గర, పీటలమీద, విందు చేస్తూ - ఒకటేమిటి - అన్నింటా పాటలే - వేళాకోళాలు - వెక్కిరింతలు జోరున వుంటుంది. అలా విందు జరుగుతూన్న సమయంలో విందును గురించి పాడుతున్నారు మగపెళ్ళివారి ఆడవారు)

028. విందు పాట

ఏలాగు భోంచేతుము
ఏ విందు మేమెలాగు
భోంచేతుము ...

విస్తర్లువేశారు దోసెడేసి
వెడల్పులేదండి హస్తంబు
కదులూటాకూ
ఔరా చోటులేదు ఏలాగు
భోంచేతము ...

ముక్కా బియ్యము వండిరీ
దానిలోకి ముద్దాపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గౌతుంది
చెయ్యికడిగిన జిడ్డేలేదు ...

కూరే వంకాయకూర
దానిలోకి మార్చే పచ్చడీ లేదు
కలహంబులేకానీ కారంబులు
గుచ్చెత్తిరి ...

పులిహార పులుపాట
అబ్బ, చింతకాయపులుసు
ఏకలహంబులేకా మరి
కరివేపాకు గుచ్చెత్తిరి ...

లడ్డు జిలేబాలు
లేపాకములో మడ్డీ
తేలిందాటా
వడ్డించే వదినగారికి
వడ్డాణా మూడీపోయే ...
AndhraBharati AMdhra bhArati - viMdu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )