దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(నీతులు నేర్పే చిన్ని పాట)

029. ఓ కోడలమ్మా

ఓ కోడలమ్మా!
ఓ కోడలమ్మా!
అదర గొట్టేవాని
హద్దు మీరేవాని
ఆదరించుట
మోసమన్నా ...

ఆడి తప్పిన వాని
ఆలి మరచిన వాని
ఆదరించుట
మోసమన్నా ...

ఆటలంటూ వచ్చి
హద్దు మీరే వాని
కనికరించుట
మోసమన్నా ...
AndhraBharati AMdhra bhArati - O kODalammA - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )