దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
041. పుట్టిల్లు

పిండికొడదా మక్కా
బండెక్కుదామా.
రామగిరి వెడదామ
రావె చెల్లాలా.
రామగిరి పట్టాన
మనకెవ్వ రక్కా.
మన అమ్మ-తమ్ములే
మనకు మామల్లు.
మేడచుట్టూ రెండు
మేటి స్థంభాలు.
మేనమామ దివాణం
నే పుట్టినిల్లు.
దొడ్డిచుట్టూ రెండు
దిడ్డి గంపల్లు.
దొడ్డవారి దివాణం
అమ్మ పుట్టిల్లు.
AndhraBharati AMdhra bhArati - puTTillu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )