దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(భక్తితో పాడే ముక్తిదారికి వినిపించే పాట)

043. భక్తి

పలుకే బంగారమా
పిలిచీన పలుకావూ
పరమ నిదానా
పతిత పావనా ..

మధురాపదార్ధముల్‌
మరగెనే పాత్రలన్‌
అలసితీ సొలసితీ
మధూమే కోరితే ..

ధనమిమ్మంటినా
ధాన్యమిమ్మంటినా
కదలవూ మెదలవూ
మధూమే కానవూ ..
AndhraBharati AMdhra bhArati - bhakti - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )