దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఒదినలను ఏడిపిస్తూ - వేళాకోళం చేస్తూ మరదళ్ళు పాడే హాస్యపాటలలో యిదొకటి)

051. వదిన పాట

నమ్మరాదే వదినాలను
నమ్మరాదే మగువాలను

పిలిచీనా పలుకరుగా
మా మాటైనా వినరుగా
ఎంతో వేడినాగాని
చూడానే చూడరు

అందారి లోపాలను
పెద్దద్దము పెట్టుకొనుచు
సందు సందులు తిరిగె
సఖియాలు వారాలు

బావాగార్లా ఎదుటను
రవ్వంత సిగ్గైనా లేకను
రమ్యముగా నాట్య
మాడుచు నుండేటివారు

వాలూ జడలూ వేయుచు
పైకి క్రాపింగు దువ్వుచును
హెచ్చుగ గూడగట్టు
గట్టుచుండేటి వారలు

బొట్టూలను చెరపూచు
కొత్తా కోకలకట్టుచు
బజారు వీధిని షికార్లూ
తిరుగూచు

చీకటి వేళాలాను
పైరూలు తిరుగూచూను
మీవాళ్లు ఆ వీధిలో కనుపించె
వారనుగూడాను అంటారు
AndhraBharati AMdhra bhArati - vadina paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )