దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
055. తిరుగలి పాట

పుణ్యవంతులమ్మ
ఈ యింటివారు
అన్నలని పిలిచితివి
తమ్ములని పిలిచితివి
నన్నేల పిలువవే
ఓ చిన్ని మరదలా

ఏమని పిలుచుదును
ఓ ఎర్రి శివుడా
నీళ్ళ బాణము తొడిగి
నరలోకమేలేనే
నా పుణ్య పురుషుండు
పువ్వులాబాణం తొడిగి
కప్పరథమెక్కే
పురుషుడు భూలోక
మేలినాడని చెప్పు
వచ్చేటి పొయ్యేటి
దారి గలదు
శివునికి శివపూజ
కోరినానని చెప్పు.
AndhraBharati AMdhra bhArati - tirugali paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )