దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
058. బొమ్మల పెళ్ళి

ప్రేమమీర కృష్ణునికి
పెట్టరే చెలీ.

బొమ్మలాకు పెండ్లిండ్లు
సమ్మతీతో చేతమంటే
బొమ్మలన్ని ఒక్కచోట
గుములుగూడెనే

భామలాకు రుక్మిణీకి
భామ సత్యభామలాకు
ప్రేమమీర కృష్ణునికి
పెండ్లి చేయరే.
AndhraBharati AMdhra bhArati - bommala peLLi - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )