దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఇదీ ఆడవారి నోముపాటే)

059. చిట్టీబొట్టు

చిట్టీ బొట్టూ
పట్టావాలే
సిరిగలయింట
పుట్టావాలే
ఏడుగురు అన్నల
తోడాబుట్టావాలే
ఏకాచక్రం
ఏలావలే
కాటిక గౌరూ
పట్టావాలే
కలిగిన వారింట
పుట్టావాలే
నిత్య శృంగారం
పట్టావాలే
నిత్యము మాయింట
పసుపూ కుంకుమ
పన్నే - అద్దం
అమ్మలకు నేను
యియ్యావాలే.
AndhraBharati AMdhra bhArati - chiTTiiboTTu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )