దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(అన్నకు పెళ్ళి అయి వదిన యింటికి రాగానే - మరదలు వేధించుకుతినే సాంప్రదాయంలాంటి అలవాటు వెక్కిరింతలలోంచి తొంగిచూసే వేళాకోళంకా ప్రతిరూపం ఈ వదిన పాట)

065. వదిన పాట

వగలాడి వదిన వగలు జెంద
వగలు బోకుమే మగువా
మాయన్నా గారెట్టు వలచెనే        ॥వగ॥

తప్పనోరు సొట్టముక్కులు
తొట్టినడ్డిటా మిట్టగుడ్లు
బట్టతలయు చేతచెవులటా        ॥వగ॥

ఇరుకు మెడయు మురికి యొడలు
గరుకుపనులు యిరుకు మెడయు
పిరికి నడతలూ        ॥వగ॥

పొట్టికాళ్ళు మిట్టనుదురు
తొంటి చేతులూ
బొర్రకడుపు చట్టిమూతి
దుష్టచేష్టలూ        ॥వగ॥

చెప్పసిగ్గు నొప్పుగొప్ప
లొప్పెనె మొప్పుగాను
గాలిసుబ్బారాయ వరసుతన్‌        ॥వగ॥
AndhraBharati AMdhra bhArati - vadina paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )