దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
074. దంపు పాట

పిండీ కొట్టామనీ
పిండుకోకండి
ఇరుగు పొరుగుల్లార
ఇది ముగ్గు పిండి
సువ్వి - హా - సువ్వి
పిండికొట్టి అల్లుడ్ని
పిలువ నంపితే
రానాని అల్లూడూ
రచ్చకొమ్మెక్కే
సువ్వి - హా - సువ్వి
రానాని అల్లూడూ
రచ్చకొమ్మెక్కే
పిలువానని వారి మామ
పేటాకొమ్మెక్కే
సువ్వి - హా - సువ్వి
పిలువానని వారి మామ
పేటాకొమ్మెక్కే
వండానని వారత్త
వంటిళ్లు సొరద
సువ్వి - హా - సువ్వి
AndhraBharati AMdhra bhArati - daMpu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )