దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
075. నిదుర పాట

నిదురా పోడమ్మా
మా రామయ్యా
బెదరీనాడమ్మా
నిదురా పోడమ్మా
మదవాతీ తానెంతో
నిదురా బుచ్చినగాని
బెదరీ బెదరీ చూచు

లోలాక్షిరో పశి
బాలలలో గూడి
ఆడూకో పోగానే
గాలీ సోకినాదేమో

మచ్చీకతో నెంతో
గృచ్చీ కౌగాలించీ
చిచ్చికొట్టినా కన్నులు
విచ్చీవిచ్చీ చూచు

కలలోనా యాపది
తలలా వాడూ వచ్చి
యెదుటా నిలచీనటుల
పలకారింపాసాగె

కరదూషణాదులచే
కాదురవస్తలను చెంది
పరమపురుషులు చూసి
పరితాపా మొందేనూ

హేతువా దెలసీ యా
భూతవైద్యూనీ పిలచి
నాతీ రక్షరేకు చేతాగట్టినాగానీ
గట్టిగా మనమూ వశిష్టిని
పిలాపించి దిష్టి విభూతైనా
నొదటా పెట్టాగానే

పచ్చీపసుపూ సున్నం
తెచ్చీ వసంతం చేసి
ఎర్రనీ నీళ్లూ పోసినాగానీ

మేలుకోడానికీ
యూరా కుండడూ
వాలాయముగా
వెంకట చలపతి
AndhraBharati AMdhra bhArati - nidura paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )