దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
078. బంతులాట

ఏమిరా శ్రీకృష్ణ
ఇంతయాగడము
తగునట్ర నీకు యిది
జగతి లోపలను
గొల్లవారిండ్లలో
గోనెలో దూరి
వెన్నపాల్‌ పెరుగులు
వెన్న మీగడలూ
ఏల తింటివిరోరి
చిన్న కృష్ణమ్మ?
వాళ్ళంత మనమీద
ఒచ్చి పడ్డారు
వచ్చి నీ బుద్దులూ
వరస చెప్పిరిగా
మనవంటి వారికిది
మరియాదకాదు
నా చిన్ని కృష్ణయ్య
నా కొంటె తనయ

అమ్మరో గోపమ్మ
అమ్మ వినవమ్మ
నాయందు నేరంబు
నీవు మోపితివి
చిన్నవారలతోడ
బంతులాడంగ
నా బంతి పోయెనే
దానింటిలోకి
రవికలో దాచింది
రంగైన బంతి
నేనెల్లి యిమ్మన్న
ఇవ్వదా బంతి
నా బంతి తీసుకుని
నేను వచ్చితిని
అమ్మరో వినవమ్మ
అమ్మ గోపమ్మ.
AndhraBharati AMdhra bhArati - baMtulaaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )