దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పసిపాపల కోసం వెలువడిన లక్షోపలక్షల జోలలో ఈ జోల ఒకటి.)

080. జోల పాట

జో జో ముద్దులబాలా
జో జో పరమ సుశీలా
జో జో భారత పుత్రీ
జో జో సారస గాత్రీ        ॥జో॥

చిన్నిమోము చిన్నబోవా
కన్ను చెదర ఏడువనేలా
కన్నతల్లి కారణములేమొ
కన్నులు మూయవె కనకపు బొమ్మ        ॥జో॥

దంతపు టుయ్యాలలోనా
ధగధగ మెరిసేటి పాన్పుపైనా
చింతాలేక నిదురాపోవా
ఇంత ఆగడమేమొగాని        ॥జో॥

పాలు త్రాగునాడె నీవు
పాడవలెనని సీతాచరితం
భూమిమీద పరుగిడినపుడే
భూరివిద్యలు నేర్చేవె తల్లీ        ॥జో॥

భారతీయ నారీమణులూ
భాసిరిల్లుము సీతాచెరితం
కన్నతల్లి కారణమేమి
కరములెత్తి ఆడవె తల్లీ        ॥జో॥
AndhraBharati AMdhra bhArati - joola paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )