దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
081. జోల పాట

శ్రీరామ జయరామ
శృంగార రామ
చారు విక్రమ రామ
చంద్ర రఘురామ
భక్తజన దారిద్ర్య
భంజనుడ రామ
ముక్తిదాయక రామ
మురవైరి రామ
గోవింద గోవిందా
గోకులా నంద
రార పరమానంద
రామ గోవింద
గోవింద గొల్లపల్లెకు
పోకు మయ్య
గోపికలు నిను వచ్చి
కొట్టేరు స్వామి
గోవింద గోపాల
రార కృష్ణమ్మ
ఆనంద మాడరా
మా పల్లెలోన
మామంద పాల్తాగి
మమ్ము రక్షించు
ఓయమ్మ ఓతల్లి
ఓ గోపిదేవి
ఎన్ని నోములు నోచి
కనెను కృష్ణున్ని
వట్టి పిండిని తిని
వరచవుతులుండి
వరపడీ కనెనమ్మ
వరద రాజులును
అంత కంతకు ముద్దు
ఆ యశోదకును
వింతలుగ జూపెనే
వేడ్క నొకనాడు
నారాయణా కృష్ణ
నవనీత చోర
ద్వారకాపురి వాస
ధర్మ రక్షకుడా
నారాయణా నిన్ను
నమ్మి నానయ్య
శరణని నీ మరుగు
జొచ్చి నానయ్య
నీకు సేవలు చేయ
మా భారమయ్య.
AndhraBharati AMdhra bhArati - joola paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )