దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పిలిచినా ఆ సమయంలో వినిపించని దృష్టి - ఆ కోలాటాల కర్రల తాళాలలో - ఆ పాటల మాటల మధురాల తియ్యదనాలతో మునిగిపోయే ఘట్టం అది - నాగరికత పేరున స్వస్తి చెబుతున్నా పాతపాట ఆటల గుత్తిలోని ఓ మందారం ఈ పాట)

090. కోలాటం

అడవీ స్థలముల
కరగుదమా?

వటపత్రంబులు
కోయుదమా?

జనులారా గుమి
కూడుదమా?

జటకోలాటము
వేయుదమా?

నొకరి నొకరి తా
నొక కుడి యెడమల
నొప్పుగ దీనిని
తిప్పుదమా?

మంచిగంధమూ
తీయుదమా?

చెంచిత మెడకిది
పూయుదమా?

మల్లెపూవులూ
కోయుదమా?

మందయానపై
జల్లుదమా?

కోతి కొమ్మచ్చు
లాడుదమా?

కోరి వనంబుల
చేరుదమా?

దాగుడు మూతా
లాడుదమా?

తరువుల చాటున
దాగుదమా?

విప్ప పువ్వులూ
ఏరుదమా?

విసువక మనమిపుడు
పోవుదమా?
AndhraBharati AMdhra bhArati - koolaaTaM - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )