దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(హాస్యం - వెటకారం - కలగలిపిన దంపు)

094. దంపు పాట

బావయ్యొచ్చాడు
కూరేమి లేదూ
కుళ్లిపోయినా
గుమ్మడికాయా
బావాకు కూర

అన్నయ్యొచ్చాడూ
కూరేమి లేదూ
గుడ్లెట్టు కోడిపెట్ట
గుజ్జన్న కూర.
AndhraBharati AMdhra bhArati - daMpu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )