దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
096. దంపు పాట

సురతాడి మా వొదిన
సూదూ లమ్మిందీ
సూదూ లమ్మిన గింజ
గాదీ కట్టిందీ
సువ్వి - హా - సువ్వి

వీపరాలు మా వొదిన
విందట్టుకొస్తే
నల్లేరు నలుగెడుదు
కంద నీళ్లోస్తూ
సువ్వి - హా - సువ్వి

వండినది వొదినా
వలపూలతో
మాగింది ఒదినా
మామిడి పండల్లె
సువ్వి - హా - సువ్వి
AndhraBharati AMdhra bhArati - daMpu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )