దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(చందమామతో మాట్లాడడం వారి గుత్తకదూ మరి)

105. చందమామ

చందమామ చందమామ
ఓ చందమామా
నీ సందడీలు నెలాకన్నా
శ్రీ రంగధామా

ముత్యాలూ పగడాలూ
కలబోసీ నట్లూ
నా ముచ్చటైనా తీరదాయే
ఓ చందమామా

పాలూనూ పంచదార
కలబోసి నట్లూ
నే కలబోసి నట్లూ
నా పంతమైనా తీరదాయె
ఓ చందమామా

వచ్చీపోయే దారిలోనూ
చామరెండా బోసి
నే చామరెండా బోసి
నా చామలన్నీ చామలాయెను
ఓ చందమామా

కుదురూ గుమ్మడీ కింద
కురిసిందీ వాన
ఆ, కురిసిందీ వాన
నా కురులన్నీ విరులాయెనూ
ఓ చందమామా.
AndhraBharati AMdhra bhArati - chaMdamaama - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )