దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఏ బీబీనాంచారమ్మనో కలుసుకొని వచ్చాడని అలిగిన అలుగుల మంగమ్మ శ్రీనివాసుడిని ప్రశ్నిస్తూంది - వినండి ఆ సంవాదం)

108. తలుపు దగ్గర పాట

శ్రీకాంతామణి నే నీ సఖుడను
శీఘ్రము వాకిలి తీవే నీవు
శీఘ్రము వాకిలి తీవే.

        ఓ కాంతుడ నీగుణములు తెలిసెను
        ఊరికి వెళ్లగదోయీ నీవు
        ఊరికె వెళ్లగదోయీ

ఈ మాటలు నీవెన్నడాడవది
ఏమే అలుమేలుమంగా అది
ఏమే అలుమేలు మంగా

        భామల మరగిన వాడవు నాతో
        పలుకేల పో - వోయీ - యీ
        పలుకులేల పోవోయీ

పరభామలనే కూడితినని యిటు
పలుకుట కారణమేమే సఖి
పలుకుట కారణమేమే.

        తరుణుల కూడక యుంటే పువ్వుల
        దండలు ఎక్కడివోయీ పూల
        దండలు ఎక్కడివోయీ.

హరిహరి నేనే మెరుగను భక్తులు
అర్పించిరె వో చెలియా నా
కర్పించిరె ఓ చెలియా.
AndhraBharati AMdhra bhArati - talupu daggara paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )